మిర్యాలగూడ , 18 సెప్టెంబర్ (హి.స.)తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల డిసెంబరు నెల కోటాను టీటీడీ ఆన్లైన్ ద్వారా గురువారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. ఈసేవా టికెట్ల ఎలక్ర్టానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు భక్తులు నమోదు చేసుకోవచ్చు. అంగప్రదక్షిణ టోకెన్లు కూడా ఆన్‌లైన్‌లో ఎలక్ర్టానిక్ డిప్ ద్వారా కేటాయించనున్నారు. ఈ టికెట్లు, టోకెన్లను పొంది...సెప్టెంబరు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించినవారికి డిప్ ద్వారా టికెట్లు మంజూరు చేస్తారు. ఇక, 22వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలకు కూడా కేటాయిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ