హైదరాబాద్, 18 సెప్టెంబర్ (హి.స.)
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఎన్స్ఫోర్ట్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం నుంచి సికింద్రాబాద్ మహేంద్రహిల్స్లో ప్రముఖ వ్యాపారవేత్త బూరుగు రమేశ్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. రమేశ్తోపాటు ఆయన కుమారుడు విక్రాంత్ నివాసంలోనూ సోదాలు జరుపుతున్నారు.రెండు బృందాలుగా విడిపోయిన ఈడీ అధికారులు అల్వాల్, మారేడుపల్లిలో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు