తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం ఈ ఎంసీ 2 లోని మునూత్ బ్యాటరీ తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
తిరుపతి, 18 సెప్టెంబర్ (హి.స.) ఏర్పేడు మండలం ఈఎంసీ 2లోని మునూత్ బ్యాటరీల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున లిథియం అయాన్ బ్యాటరీలు పేలిపోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి స
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం ఈ ఎంసీ 2 లోని మునూత్ బ్యాటరీ తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం


తిరుపతి, 18 సెప్టెంబర్ (హి.స.) ఏర్పేడు మండలం ఈఎంసీ 2లోని మునూత్ బ్యాటరీల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున లిథియం అయాన్ బ్యాటరీలు పేలిపోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసి సహాయక చర్యలు చేపట్టారు. ఉద్యోగులు, కార్మికులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. పరిశ్రమ పూర్తిస్థాయిలో దగ్ధమవడంతో భారీగా ఆస్తినష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande