హైదరాబాద్, 18 సెప్టెంబర్ (హి.స.)
పొద్దు పొద్దున్నే హైడ్రా అధికారులు
కూల్చివేతలు చేపట్టారు. శంషాబాద్ పట్టణంలోని మేరీ గార్డెన్ సమీపంలో మల్లన్న గుట్ట వద్ద బూరుగుకుంట సమీపంలో ఏర్పాటుచేసిన షెడ్లను కూల్చివేశారు. చెరువు సమీపంలో బఫర్ జోన్ లో ఈ షెడ్లను ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంలో ఫిర్యాదు అందుకున్న హైడ్రా అధికారులు గురువారం ఉదయమే డీఆర్ఎఫ్ సిబ్బందితో అక్కడికి చేరుకొని జేసీబీల ద్వారా కూల్చివేతలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హైడ్రా అధికారులు హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు