హైదరాబాద్, 18 సెప్టెంబర్ (హి.స.)
ఎమ్మెల్సీ కవిత రాజీనామా అంశంపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడతూ.. కవిత రాజీనామాపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని ఇటీవల కవిత ఫోన్ కూడా చేశారని తెలిపారు. పార్టీ నుంచి బహిష్కరించిన నేపథ్యంలో ఎమోషనల్గా చేశారు కాబట్టి.. పునరాలోచన చేసుకోవాలని చెప్పానని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో విద్య, వైద్యం సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా దృష్టి సారించారని అన్నారు. నిమ్స్ తరహాలో మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఫీజు రియింబర్స్మెంట్ ఇబ్బందులు తగ్గాలంటే రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేయాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు