మిర్యాలగూడ ని, 18 సెప్టెంబర్ (హి.స.) యోజకవర్గంలో రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించడం కోసం రైతు సంక్షేమమే లక్ష్యంగా రెండు కోట్ల రూపాయల చెక్కును స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా యూరియా కొరత వలన రైతులు ఇబ్బంది పడుతున్నారని రైతుల సమస్యను పరిష్కరించడం కోసం ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. తాను అందజేసిన ఆర్థిక సాయంతో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి రైతుకు ఒక యూరియా బస్తా ఉచితంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు