బుర్జ్ ఖలీఫా పై మెరిసిన ప్రధాని మోదీ.. ఆకట్టుకుంటున్న వీడియో
హైదరాబాద్, 18 సెప్టెంబర్ (హి.స.) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా . ప్రత్యేక సందర్భాల్లో ఈ కట్టడం ఎస్ఈడీ స్క్రీన్తో ప్రత్యేక థీమ్ను ప్రదర్శిస్తుంది. తాజాగా ఆ ఎత్తైన భవనంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మెరిశారు. ప్రధాని మోదీ 7
Burj కలీఫా


హైదరాబాద్, 18 సెప్టెంబర్ (హి.స.)

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా . ప్రత్యేక సందర్భాల్లో ఈ కట్టడం ఎస్ఈడీ స్క్రీన్తో ప్రత్యేక థీమ్ను ప్రదర్శిస్తుంది. తాజాగా ఆ ఎత్తైన భవనంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మెరిశారు.

ప్రధాని మోదీ 75వ పుట్టిన రోజును బుధవారం ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులతోపాటూ పలు దేశాధినేతలు ప్రధానికి ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలియజేశారు. ప్రధాని మోదీ, భారత్తో తమకున్న అనుబంధాన్ని వీడియో ద్వారా పంచుకున్నారు. ఈ నేపథ్యంలో మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలతో బుర్జ్ ఖలీఫా వెలుగులీనింది. ప్రధాని చిత్రంతోపాటూ, జాతీయ జెండాను కూడా ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన వీడియోను బుర్జ్ ఖలీఫా అధికారిక ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాల్లో షేర్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande