షార్ట్ సర్క్యూట్ తో ఫుట్ వేర్ షాపు దగ్ధం.. రూ.25 లక్షల వరకు నష్టం..
హైదరాబాద్, 18 సెప్టెంబర్ (హి.స.) షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫుట్వేర్ షాప్ పూర్తిగా దగ్ధమైన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తెల్లవారుజామున జరిగింది. షాప్ యజమాని శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోనీ జిల్లెలగూడ ప్రధా
షార్ట్ సర్క్యూట్


హైదరాబాద్, 18 సెప్టెంబర్ (హి.స.)

షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫుట్వేర్ షాప్ పూర్తిగా దగ్ధమైన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తెల్లవారుజామున జరిగింది. షాప్ యజమాని శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోనీ జిల్లెలగూడ ప్రధాన రహదారి పక్కనే ఉన్న స్వాగత్ గ్రాండ్ భవనం సెల్లార్ లో శ్రీ శ్రీ ఫుట్వేర్ షాపులో గురువారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించి షాపులోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయని తెలిపారు. సుమారు 25 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అని తెలిపారు. షాప్ లో నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు షాప్ యజమానితో పాటు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తెచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande