అమరావతి, , 18 సెప్టెంబర్ (హి.స.)
ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు (Konidela Nagababu) శాసన మండలి సమావేశానికి తొలిసారి హాజరయ్యే ముందు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను (Deputy CM Pawan Kalyan) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సోదరుడు నాగబాబును పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం పలు అంశాలపై ఎమ్మెల్సీకి డిప్యూటీ సీఎం దిశానిర్దేశం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి