ఇండియాలో.. తొలి మేడ్ ఇన్ భారత్ చిప్‌ను విడుదల చేసిన ప్రధాని
న్యూఢిల్లీ, 02 సెప్టెంబర్ (హి.స.) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం న్యూఢిల్లీలో సెమికాన్ ఇండియా 2025 ఈవెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా పీఎం మోడీ భారతదేశపు మొట్టమొదటి చిప్‌సెట్‌ను ఆవిష్కరించారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో
PM Narendra Modi Addressing the gathering


న్యూఢిల్లీ, 02 సెప్టెంబర్ (హి.స.) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం న్యూఢిల్లీలో సెమికాన్ ఇండియా 2025 ఈవెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా పీఎం మోడీ భారతదేశపు మొట్టమొదటి చిప్‌సెట్‌ను ఆవిష్కరించారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా కూడా పాల్గొన్నారు. మోడీ విక్రమ్ 32-బిట్ ప్రో చిప్‌ను ప్రదర్శించారు. సెమీకండక్టర్ చిప్ ఒక సిలికాన్ సర్క్యూట్ బోర్డ్ లాంటిది. ఈ చిప్ ఏదైనా పరికరం లేదా గాడ్జెట్‌కి.. మానవునికి బ్రెయిన్ ఎంత ముఖ్యమో అంతే ముఖ్యమైనది. సెమీకండక్టర్ చిప్ డేటా ప్రాసెసింగ్, స్టోరేజ్, కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్‌లతో సహా అనేక విధులను నిర్వహిస్తుంది.అలాగే, సెమికాన్ ఇండియా 2025 ప్రారంభోత్సవం తర్వాత, ఈ సంవత్సరం నుంచి భారతదేశం తన మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ చిప్‌సెట్ వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభిస్తుందని ప్రధాని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande