రాష్ట్రంలో రబీ సీజన్ లో మార్క్ ఫెడ్ కొనుగోలు చేసిన హెచ్ డీ బర్లీ .పొగాకు
అమరావతి, 2 సెప్టెంబర్ (హి.స.) :రాష్ట్రంలో రబీ సీజన్‌(2024-25)లో మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసిన హెచ్‌డీ బర్లీ పొగాకు రైతులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఉత్పత్తి అయిన బర్లీ పొగాకుకు గిట్టుబాటు ధర లేక రైతు
రాష్ట్రంలో రబీ సీజన్ లో మార్క్ ఫెడ్ కొనుగోలు చేసిన హెచ్ డీ బర్లీ .పొగాకు


అమరావతి, 2 సెప్టెంబర్ (హి.స.) :రాష్ట్రంలో రబీ సీజన్‌(2024-25)లో మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసిన హెచ్‌డీ బర్లీ పొగాకు రైతులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఉత్పత్తి అయిన బర్లీ పొగాకుకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడ్డ సమయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంది. సీఎం చంద్రబాబు, వ్యవసాయ మంత్రి అచ్చన్నాయుడు చొరవతో కొందరు వ్యాపారులు కొంత కొనుగోలు చేశారు. మిగిలిన ఉత్పత్తిలో 20.00మిలియన్‌ కిలోల బర్లీ పొగాకును ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌తో కొనుగోలు చేయించింది. దీనికి సంబంధించి, రైతులకు సొమ్ము చెల్లించేందుకు రూ.55కోట్లు ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. పొగాకు అమ్మిన 4,040 మంది రైతుల బ్యాంక్‌ ఖాతాలకు రూ.54,88,92,060 నేరుగా నగదు బదిలీ చేస్తున్నట్లు మార్క్‌ఫెడ్‌ ఎండీ మనజీర్‌ జిలానీ సమూన్‌ సోమవారం తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande