అత్యాచారం కేసులో ఎమ్మెల్యే అరెస్టు.. కస్టడీ నుంచి పరార్‌
న్యూఢిల్లీ, 02 సెప్టెంబర్ (హి.స.) అత్యాచారం, మోసం ఆరోపణలపై పంజాబ్‌ (Punjab)కు చెందిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఎమ్మెల్యే హర్మీత్‌సింగ్‌ ధిల్లాన్‌ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈక్రమంలో ఆయన్ను స్టేషన్‌కు తరలిస్తుండగా.. పోలీసులపై కాల్పులు జరిపి హర
Police


న్యూఢిల్లీ, 02 సెప్టెంబర్ (హి.స.) అత్యాచారం, మోసం ఆరోపణలపై పంజాబ్‌ (Punjab)కు చెందిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఎమ్మెల్యే హర్మీత్‌సింగ్‌ ధిల్లాన్‌ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈక్రమంలో ఆయన్ను స్టేషన్‌కు తరలిస్తుండగా.. పోలీసులపై కాల్పులు జరిపి హర్మీత్‌ పరారయ్యారు.

అసలేం జరిగిందంటే.. పటియాలాలోని సనూర్‌ నియోజకవర్గానికి హర్మీత్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిరాక్‌పుర్‌కు చెందిన ఓ మహిళ ఆరోపణల మేరకు హర్మీత్‌పై కేసు నమోదైంది. తనకు విడాకులయ్యాయని చెప్పి.. ఎమ్మెల్యే తనతో సంబంధం కొనసాగించాడని ఆ మహిళ ఆరోపించింది. ఆ తర్వాత తనపై బెదిరింపులకు పాల్పడ్డాడంటూ.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో కర్నాల్‌లో పోలీసులు ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా.. హర్మీత్‌, ఆయన సహాయకులు అధికారులపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడ ఉన్న కార్లలో పారిపోయారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande