హైదరాబాద్, 2 సెప్టెంబర్ (హి.స.)
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈనెల 6వ తేదీన వారు హైదరాబాద్కు రానున్నారు. నగరంలో నిర్వహించేబోయే గణేష్ శోభయాత్రలో పాల్గొననున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు ఆయన రాష్ట్రానికి వస్తున్నారు. 6వ తేదీన నగరంలోని చార్మినార్, మొజంజహీ మార్కెట్ దగ్గర అమిత్ షా ప్రసంగాలు చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. నిమజ్జనం అనంతరం తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో ఐటీసీ కాకతీయలో సమావేశం కానున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..