కెసిఆర్, హరీష్ రావుకు హైకోర్టులో భారీ ఊరట!
హైదరాబాద్, 2 సెప్టెంబర్ (హి.స.) కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవొద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్ట
హైకోర్టు


హైదరాబాద్, 2 సెప్టెంబర్ (హి.స.)

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవొద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 7వ తేదీన ప్రధాన పిటిషన్ విచారణ ఉన్నందున దసరా సెలవుల అనంతరం తదుపరి విచారణ ఉంటుందని హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. అప్పటి వరకు కమిషన్ ఆధారంగా కేసీఆర్, హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవొద్దని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande