కవిత ఇప్పుడొచ్చి.. కేసీఆర్కు ఏ పాపం తెలియదంటే నమ్మేస్తారా? డీకే అరుణ
హైదరాబాద్, 2 సెప్టెంబర్ (హి.స.) కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి అప్పగించడంపై ఎంపీ డీకే అరుణ స్పందించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేసీఆర్ కుటుంభం సభ్యులందరికీ కాళేశ్వరం అవినీతిలో భాగం ఉన్నదన్నారు. కల్వకుంట్ల కవిత ఇప్పుడొచ్చి.. కేసీఆర్కు ఏ పాపం తెలియ
డీకే అరుణ


హైదరాబాద్, 2 సెప్టెంబర్ (హి.స.)

కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి అప్పగించడంపై ఎంపీ డీకే అరుణ స్పందించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేసీఆర్ కుటుంభం సభ్యులందరికీ కాళేశ్వరం అవినీతిలో భాగం ఉన్నదన్నారు. కల్వకుంట్ల కవిత ఇప్పుడొచ్చి.. కేసీఆర్కు ఏ పాపం తెలియదంటే ముక్కున వెలిసుకుంటారు తప్పితే, ఎవరు నమ్మరు అని విమర్శించారు. ఏ రాజకీయం లబ్ది కోసం కవిత ఆ డైలాగులు కొట్టిందో తెలియదు? అని డీకే అరుణ ఎద్దేవా చేశారు.

ఎంపీ డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ..కాళేశ్వరం విషయంలో కమిటీ, నివేదికలంటూ ఇన్నాళ్లు కాంగ్రెస్ కావాలనే తాత్సరం చేసింది. ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంలా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీని తప్పించాలనే కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు ఉంది. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి రాగానే ఈ కేసును సీబీఐకి అప్పగించొచ్చు కదా. కమిటీలు, విచారణలు, నివేదికలు అన్నారు. ఆ నివేదికలో ఏముందో ఎందుకు బయట పెట్టలేదు?. చివరకు అర్ధరాత్రి వరకు అసెంబ్లీలో చర్చ పెట్టి సీబీఐకి అప్పగిస్తున్నామన్నారు' అని చెప్పారు.

'కాళేశ్వరం విషయంలో కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది కాంగ్రెస్ తీరు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ ముందు నుంచి కోరుతుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande