ఆంధ్రప్రదేశ్ లో.5 రోజుల పాటు.భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా
అమరావతి, 2 సెప్టెంబర్ (హి.స.) ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతోంది ఉపరితల ఆవర్తనం.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.. ఇక, అల్పపీడనం ప్రభావంతో ఇవాళ విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్
ఆంధ్రప్రదేశ్ లో.5 రోజుల పాటు.భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా


అమరావతి, 2 సెప్టెంబర్ (హి.స.) ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతోంది ఉపరితల ఆవర్తనం.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.. ఇక, అల్పపీడనం ప్రభావంతో ఇవాళ విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. ఆరెంజ్ బులెటిన్ హెచ్చరికలు జారీ చేసింది విశాఖపట్నం వాతావరణ కేంద్రం.. మిగిలిన కోస్తా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.. ఆయా జిల్లాల్లో ఇవాళ, రేపు విస్తారంగా వర్షాలకు ఆస్కారం ఉంది.. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి.. అయితే, అల్పపీడనం ప్రభావం ఉన్న నేపథ్యంలో.. వచ్చే ఐదు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది విశాఖ వాతావరణ కేంద్రం.. కాగా, మరోవైపు, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ వర్షాలు కురుస్తున్నాయి.. ఓ అల్పపీడనం ప్రభావం తగ్గక ముందే.. మరో అల్పపీడనంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande