హైదరాబాద్, 2 సెప్టెంబర్ (హి.స.)
కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు, సంతోష్ రావు వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడనేది రాజకీయ ఆరోపణ మాత్రమే అని అన్నారు. కాళేశ్వరంపై లోతైన విచారణ అభిప్రాయపడ్డారు. కాంట్రాక్టర్ల వ్యవహారంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఇలాంటి కేసుల్లో రాజకీయ నేతలను మాత్రమే బలిపశువులను చేయడం సరికాదని హితవు పలికారు. కొందరు అధికారుల దగ్గర వందల కోట్లు బయటపడుతున్నాయి. అలాంటి అధికారుల సంగతి ఏంటి? అని ప్రశ్నించారు. ఫిరాయింపుల విషయంలో తనకు స్పీకర్ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని దానం నాగేందర్ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..