ఢిల్లీలో యమునా నది ఉధృతం.. ఇళ్లల్లోకి వచ్చేసిన నీరు.. స్కూళ్లు, ఆఫీసులు మూసివేత
న్యూఢిల్లీ, 2 సెప్టెంబర్ (హి.స.) దేశ రాజధాని ఢిల్లీ, నోయిడా, గురుగ్రాము భారీ వరదలు ముంచెత్తాయి. సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రధాన ప్రాంతాలన్నీ అతలాకుతలం అయ్యాయి. రహదారులన్నీ నదులు తలపిస్తున్నాయి. ఎటుచూసినా నీళ్లే కనిపిస్తున్
యమునా నది


న్యూఢిల్లీ, 2 సెప్టెంబర్ (హి.స.)

దేశ రాజధాని ఢిల్లీ, నోయిడా, గురుగ్రాము భారీ వరదలు ముంచెత్తాయి. సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రధాన ప్రాంతాలన్నీ అతలాకుతలం అయ్యాయి. రహదారులన్నీ నదులు తలపిస్తున్నాయి. ఎటుచూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. దీంతో పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. ఇక గురుగ్రామ్ అయితే 7 కి.మీ పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు నరకయాతన పడ్డారు.

ఇక భారీ వర్షాలు కారణంగా యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాద స్థాయిని దాటి ఉప్పొంగుతోంది. దీంతో వరద నీరు ఇళ్లల్లోకి వచ్చేసింది. ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచిస్తున్నారు. సాయంత్రానికి యమునా నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని.. తక్షణమే లోతట్టు ప్రాంత ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande