అమరావతి, 2 సెప్టెంబర్ (హి.స.) ఆరోగ్యశాఖ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈ ప్యానల్ ఇయర్‌లో దాదాపు 600 మంది వైద్యులు, మరో వంద మందికిపైగా అధికారులకు పదోన్నతులు లభించాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ), డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్(డీఎ్‌సహెచ్), డైరెక్టర్ ఆఫ్ హెల్త్(డీహెచ్), ఆయుష్ విభాగం, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఇలా ప్రతి విభాగంలో వైద్యులకు, సిబ్బందికి పదోన్నతులు లభించాయి. చివరికి 20 ఏళ్ల నుంచి పదోన్నతులకు నోచుకొని గ్రూప్-1 అధికారులకు కూడా డిప్యూటీ డైరెక్టర్ నుంచి జూయింట్ డైరెక్టర్‌గా పదోన్నతులు లభించాయి. డ్రగ్స్ విభాగంలో కూడా ఇద్దరు డిప్యూటీ డైరెక్టర్లకు జాయింట్ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పించారు. డీఎంఈ చరిత్రలోనే 13 మంది సీనియర్ ప్రొఫెసర్లకు అదనపు డైరెక్టర్లు(ఏడీ)గా పదోన్నతులు కల్పించారు. వీరితోపాటు డీఎంఈలో ఈ ఏడాది 217 మంది వైద్యులు పదోన్నతి పొందారు. అసోసియేట్ ప్రొఫెసర్లు 96 మంది ప్రొఫెసర్లుగా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 108 మంది అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోట్ అయ్యారు. బోధన అనుభవం ఉన్న అసోసియేట్‌కు ప్రొఫెసర్లుగా తొలిసారి అవకాశం కల్పించిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానికి
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ