బస్సు డ్రైవర్లకు సెల్ ఫోన్ కట్..! ప్రమాదాలకు బ్రేక్ వేసేలా ఆర్టీసీ సరికొత్త ఆలోచన
హైదరాబాద్, 2 సెప్టెంబర్ (హి.స.) ఓ చేత్తో స్టీరింగ్ పట్టుకొని డ్రైవింగ్ చేస్తూ, మరో చేత్తో సెల్ ఫోన్లో మాట్లాడుతూ కొంత మంది డ్రైవర్లు బస్సులను నడిపే సీన్లు ఇంతకు మునుపు మనం చాలానే చూశాము. కానీ ఇప్పటి నుంచి ఇలాంటివి జరగకుండా ఆర్టీసీ అధికారులు పూర్తి
తెలంగాణ ఆర్టీసీ


హైదరాబాద్, 2 సెప్టెంబర్ (హి.స.)

ఓ చేత్తో స్టీరింగ్ పట్టుకొని డ్రైవింగ్

చేస్తూ, మరో చేత్తో సెల్ ఫోన్లో మాట్లాడుతూ కొంత మంది డ్రైవర్లు బస్సులను నడిపే సీన్లు ఇంతకు మునుపు మనం చాలానే చూశాము. కానీ ఇప్పటి నుంచి ఇలాంటివి జరగకుండా ఆర్టీసీ అధికారులు పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు సెల్ ఫోన్ను వెంట తీసుకుపోకుండా కళ్లెం వేశారు. తెలంగాణలోనీ 11 డిపోలలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయగా మెదక్ రీజియన్లో నీ సంగారెడ్డి డిపోను పైలెట్ ప్రాజెక్టు కింద ఇందుకు ఎంపిక చేశారు. రోజు డ్యూటీ ఎక్కే ముందు డ్రైవర్లు తమ సెల్ ఫోన్ను డిపో మేనేజర్, లేదా సూపర్వైజర్ వద్ద ఇచ్చేసి డ్యూటీలో చేరాల్సి ఉంటుంది.

బస్సు డ్రైవర్ల కుటుంబ సభ్యులు ఏదైనా అత్యవసర సమాచారం చెప్పాల్సి ఉంటే డిపో మేనేజర్కు లేక సూపర్వైజర్కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. వెంటనే వారు బస్సులో ఉండే కండక్టర్కు ఫోన్ ద్వారా ఆ సమాచారాన్ని చేరవేస్తారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande