అమరావతి, 2 సెప్టెంబర్ (హి.స.)
కాజీపేట, : హనుమకొండ జిల్లా హసన్పర్తి రోడ్- కరీంనగర్ జిల్లా జమ్మికుంట మధ్య మంగళవారం నుంచి రైళ్లు ఒకదాని వెనుక ఒకటి కేవలం కి.మీ. మధ్య దూరంతో ఒకే మార్గంలో పరుగెత్తనున్నాయి. రైళ్ల ఆలస్యాన్ని నివారించడానికి రైల్వే శాఖ ఆటోమెటిక్ బ్లాక్ సిగ్నలింగ్(ఏబీఎస్) వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.
దక్షిణ మధ్య రైల్వేలో తొలిసారిగా బల్లార్ష- విజయవాడ మధ్య గల గ్రాండ్‌ట్రంక్ రోడ్ మీద దీన్ని అమలు చేస్తున్నారు. ఈ అత్యాధునిక వ్యవస్థ కారణంగా మానవ ప్రయత్నం లేకుండానే ఆటోమెటిక్ గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఏబీఎస్ విధానం అమలుకు రైలు పట్టాల కింద సెన్సర్లను బిగిస్తారు. దీనిని సిగ్నలింగ్ వ్యవస్థకు అనుసంధానం చేసి బ్లాకులుగా విభజిస్తారు. ఒక బ్లాక్ నుంచి రైలు వెళ్లిపోగానే దాని వెనుకాలే ఉన్న మరో రైలును అనుమతిస్తుంది. ఇందులో సిగ్నల్స్ వేగంగా పనిచేయడం వల్ల రైళ్లు మధ్య దూరం తక్కువ ఉన్నా ఒక దాని దగ్గరకు మరొకటి రాకుండా ఈ వ్యవస్థ నిరోధిస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ