ఎరువులు పక్కదారి పట్టనివ్వద్దు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి, 2 సెప్టెంబర్ (హి.స.)ఏపీలో ఎరువులు పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యత, మార్కెటింగ్ శాఖపై సీఎం సమీక్షించారు. ఈ సమీక్షకు మం
చంద్రబాబు నాయుడు


అమరావతి, 2 సెప్టెంబర్ (హి.స.)ఏపీలో ఎరువులు పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యత, మార్కెటింగ్ శాఖపై సీఎం సమీక్షించారు.

ఈ సమీక్షకు మంత్రి అచ్చెన్నాయుడు, సీఎస్ విజయానంద్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎరువులు బ్లాక్ మార్కెట్​కు తరలిపోకుండా, పక్కదారి పట్టకుండా తీసుకుంటున్న చర్యలపై సీఎం అడిగి తెలుసుకున్నారు. బ్లాక్ మార్కెట్కు పోకుండా కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు.

ఈసారి రెండు లక్షలు మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు రాష్ట్రానికి వచ్చాయని అధికారులు తెలియజేశారు. ఈ క్రాప్ ద్వారా పంటల సాగు ఎంత, వినియోగం ఎంతో లెక్కించాలని సీఎం సూచించారు. పంటల సాగు, సరఫరా, లభ్యత, వినియోగంపై నిరంతరం పర్యవేక్షించాలి అన్నారు. ఎరువులు, పురుగు మందులు వినియోగాన్ని తగ్గించిన రైతులకు సబ్సిడీలు పరిశీలించాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande