పవన్ కల్యాణ్ కీలక పిలుపు
అమరావతి, 2 సెప్టెంబర్ (హి.స.)అటవీ సంపద అన్యాక్రాంతం కాకుండా అరికట్టి, అడవులను ఆర్థిక వనరులుగా మార్చుకునే విధంగా ప్రత్యేక ప్రణాళికలకు రూపకల్పన చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అటవీశాఖ అధికారులకు ఆదేశించారు. అడవుల సంరక్షణ, జీవ వ
పవన్ కల్యాణ్


అమరావతి, 2 సెప్టెంబర్ (హి.స.)అటవీ సంపద అన్యాక్రాంతం కాకుండా అరికట్టి, అడవులను ఆర్థిక వనరులుగా మార్చుకునే విధంగా ప్రత్యేక ప్రణాళికలకు రూపకల్పన చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అటవీశాఖ అధికారులకు ఆదేశించారు. అడవుల సంరక్షణ, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్(Great Green Wall) కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసి తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... “రాష్ట్రంలో స్వదేశీ జాతి మొక్కల లభ్యత తక్కువగా ఉంది. సాధారణ నర్సరీల్లో ఈ మొక్కలు లభించడం లేదు. స్వదేశీ జాతి మొక్కల పెంపకాన్ని అటవీ ప్రాంతాల్లో ఉండే గిరిజన గ్రామాలకు అప్పగించాలి. తద్వారా గిరిజనులకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించాలి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande