కడప, 2 సెప్టెంబర్ (హి.స.)ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి 16వ వర్థంతి సందర్భంగా నేడు ఆయన కుమారుడు మాజీ సీఎం జగన్, వైఎస్ఆర్ కుమార్తె షర్మిల ఇడుపులపాయకు వెళ్లనున్నారు. అయితే ఇద్దరి మధ్య వచ్చిన గ్యాప్ కారణంగా గత కొన్నేళ్లుగా జగన్, షర్మిల ఇడుపులపాయకు విడివిడిగానే వెళుతున్నారు. కాబట్టి ఈ సారి కూడా అదే విధంగా అలానే వెళుతున్నారు.
జగన్ ఆయన సతీమణితో కలిసి ఇడుపులపాయకు చేరుకుని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. మతపెద్దలు నిర్వహించే ప్రార్థనల్లో పాల్గొంటారు. తరవాత లింగాల మండలంలోని అంబకపల్లె చేరుకుంటారు. కొత్తగా నిర్మించిన చెరువుకు కృష్ణా జలాలు వచ్చిన నేపథ్యంలో జలహారతి ఇవ్వనున్నారు. మరోవైపు షర్మిల తన తల్లి విజయమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వెళ్లే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి