6న రాష్ట్రవ్యాప్తంగా నిరసన.. వైసీపీ కీలక పిలుపు
అమరావతి, 2 సెప్టెంబర్ (హి.స.)రాష్ట్రంలో యూరియా(Urea) కొరత, రైతాంగం సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr congress Party) పోరాటానికి దిగుతోంది. సెప్టెంబర్ 6న రాష్ట్రవ్యాప్తంగా ఆర్డీవో కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంల
ysr


అమరావతి, 2 సెప్టెంబర్ (హి.స.)రాష్ట్రంలో యూరియా(Urea) కొరత, రైతాంగం సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr congress Party) పోరాటానికి దిగుతోంది. సెప్టెంబర్ 6న రాష్ట్రవ్యాప్తంగా ఆర్డీవో కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చింది. కాగా రాష్ట్రంలో యూరియా కొరతపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు త్వరలోనే యూరియా దిగుమతి అవుతోందని నాయకులు చెబుతున్నారు. ఈలోపే ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలనే వ్యూహంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిరసనకు పిలుపునిచ్చిందని తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande