హైదరాబాద్,20 సెప్టెంబర్ (హి.స.)శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాగ్‌లో తరలిస్తున్న రూ.12 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని డీఆర్‌ఐ అధికారులు సీజ్ చేశారు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికురాలి వద్ద దీన్ని పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు
: .
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ