ఏపి మద్యం.కుంభకోణం.కేసులో నిందితుడైన వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి రెండో రోజు కస్టడీలోకి
అమరావతి, 20 సెప్టెంబర్ (హి.స.) మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి (ఏ-4)ని రెండో రోజు సిట్‌ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి ఆయనను విజయవాడకు తరలించారు. సాయంత్రం విచారణ అనంతరం కోర్టులో హాజర
ఏపి మద్యం.కుంభకోణం.కేసులో నిందితుడైన వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి రెండో రోజు కస్టడీలోకి


అమరావతి, 20 సెప్టెంబర్ (హి.స.)

మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి (ఏ-4)ని రెండో రోజు సిట్‌ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి ఆయనను విజయవాడకు తరలించారు. సాయంత్రం విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించనున్నారు.

ఇక మిథున్‌రెడ్డి తొలిరోజు విచారణ 4 గంటల్లోనే ముగిసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. మిథున్‌రెడ్డిని రెండు రోజుల కస్టడీకి తీసుకున్న సిట్‌ అధికారులు తొలిరోజైన శుక్రవారం 50కి పైగా ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఆయన ఏ ఒక్కదానికీ సరైన సమాధానాలు చెప్పలేదని తెలిసింది. మిథున్‌రెడ్డి కుటుంబీకులకు చెందిన పీఎల్‌ఆర్‌ ప్రాజెక్ట్స్‌ ఖాతాల్లోకి మద్యం ముడుపుల సొమ్ము రూ.5కోట్లు జమకావడంపై ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande