ప్రొద్దుటూరు, 20 సెప్టెంబర్ (హి.స.)
జమ్మలమడుగు మార్గంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వాహనాల్లో తరలిస్తున్న 16 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. రెండు కార్లు, గొడ్డళ్లు ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు వదిలి పారిపోతున్న 18 మంది స్మగ్లర్లను వెంటాడి పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ హెడ్ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ