అమరావతి, 20 సెప్టెంబర్ (హి.స.)
Iఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఓవైపు సంక్షేమం మరోవైపు.. స్థిరమైన పాలనపై దృష్టిసారించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సుదీర్ఘ కసరత్తు చేస్తూ.. అధికారులను బదిలీ చేస్తున్నారు.. ఈ మధ్యే సీనియర్ ఐఏఎస్ అధికారులు.. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు.. వివిధ శాఖల అధిపతులను మారుస్తూ వచ్చిన కూటమి ప్రభుత్వం.. తాజాగా, మరో తొమ్మిది మంది IAS అధికారులను బదిలీ చేసింది..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ