ఏపి.సీఎం చంద్రబాబు హెలికాప్టర్ లో.మాచర్ల కు.చేరుకున్నారు
అమరావతి, 20 సెప్టెంబర్ (హి.స.) మాచర్ల: ఏపీ సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా మాచర్లకు హెలికాప్టర్‌లో చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద సీఎంకు మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు తదితరులు స్వాగతం పలిక
ఏపి.సీఎం చంద్రబాబు హెలికాప్టర్ లో.మాచర్ల కు.చేరుకున్నారు


అమరావతి, 20 సెప్టెంబర్ (హి.స.)

మాచర్ల: ఏపీ సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా మాచర్లకు హెలికాప్టర్‌లో చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద సీఎంకు మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు తదితరులు స్వాగతం పలికారు. యాదవ బజారు రోడ్డులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం కానున్నారు. స్వచ్ఛరథం వాహనాలను జెండా ఊపి ప్రారంభించనున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు రెండు కోట్ల రూపాయల చెక్కుల పంపిణీ చేయనున్నారు. ప్రజావేదిక బహిరంగ సభలో మాట్లాడనున్నారు. మార్గదర్శి- బంగారు కుటుంబాల సభ్యులతో సమావేశం కానున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande