హైకోర్టు CJ అపరేశ్ కుమార్ సింగ్తో CM రేవంత్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
హైదరాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.) రాష్ట్రంలో న్యాయ వ్యవస్థకు సంబంధించి మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం అంశాలపై హైకోర్టు సీజే అపరేశ్ కుమార్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు, సీఎం ప
హైకోర్టు సీజే


హైదరాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.)

రాష్ట్రంలో న్యాయ వ్యవస్థకు సంబంధించి మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం అంశాలపై హైకోర్టు సీజే అపరేశ్ కుమార్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, లా సెక్రటరీ పాపిరెడ్డి, జస్టిస్ పి.సామ్కోశి, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్త జిల్లాల్లో అవసరమైన చోట కోర్టు భవనాలు, మౌలిక వసతులను కల్పించడంతో పాటు సిబ్బంది నియామకం చేపట్టాలని సీజే అపరేశ్ కుమార్ సింగ్ ప్రభుత్వానికి సూచించారు. ఇందుకు సంబంధించి పలు ప్రతిపాదనలను ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ప్రాధాన్యత వారీగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు కొత్త జిల్లాలలో కోర్టులకు మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపిన సీఎం రేవంత్, సీజే అపరేశ్ కుమార్ సింగ్కు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande