హైదరాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.)
సినీ నటుడు అక్కినేని నాగార్జున ను హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కలిశారు. శనివారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్లో కలిసి 'అలయ్ - బలయ్'కి రావాలని ఆహ్వానించారు. దత్తాత్రేయతో పాటు ఆయన కూతురు విజయలక్ష్మి కూడా వెంట ఉన్నారు. కాగా, తెలంగాణలో బంధు మిత్రులను కలుసుకునేందుకు ఏర్పాటు చేసే కార్యక్రమం .. 'అలయ్ - బలయ్'
తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని అద్దం పట్టేలా ఈ ఉత్సవం జరుగుతుంది. భవిష్యత్ తరాల వరకూ ఈ విషయం తెలియాలని.. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక 'అలయ్ - బలయ్'
పేరుతో బండారు దత్తాత్రేయ 2009 లో తొలిసారిగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. నాటి నుంచి అది కొనసాగుతూ వస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..