బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన హనుమకొండ కలెక్టర్
తెలంగాణ, హనుమకొండ.20 సెప్టెంబర్ (హి.స.) హనుమకొండలోని చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఈ 21న బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. శనివారం వేయి స్తంభాల దేవాలయ ప్రాంగణంలో జరిగే బతుకమ్మ ఏర్పాట్లను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, మున్
హనుమకొండ కలెక్టర్


తెలంగాణ, హనుమకొండ.20 సెప్టెంబర్ (హి.స.)

హనుమకొండలోని చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఈ 21న బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. శనివారం వేయి స్తంభాల దేవాలయ ప్రాంగణంలో జరిగే బతుకమ్మ ఏర్పాట్లను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్పేయి, ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేందర్ శర్మ, టూరిజం శాఖ జిల్లా అధికారి శివాజీతో కలిసి దేవాలయ ప్రాంగణమంతా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..

బతుకమ్మ సందర్భంగా తగిన ఏర్పాట్లు చేయాలని, దేవాలయానికి తరలివచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తూర్పు గేట్ నుంచి బ్యారేట్స్ ఏర్పాటు చేయాలని ఆ బ్యారేట్ల ద్వారానే వీఐపీలను మంత్రులను తీసుకురావాలన్నారు. దేవాలయ దర్శనం అనంతరం స్టేజీపైకి స్వాగతించాలని అధికారులను కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. వీఐపీలు బతుకమ్మ ఆడుకోవడానికి స్పెషల్గా పెద్ద బతుకమ్మ ఏర్పాటు చేయాలని సూచించారు. దేవాలయ ప్రాంతమంతా విద్యుత్ అలంకరణ ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande