నేరాల నియంత్రణపై అవగాహన.. హుజురాబాద్ ఏసిపి
తెలంగాణ, కరీంనగర్. 20 సెప్టెంబర్ (హి.స.) నేరాల నియంత్రణ కోసం జిల్లాలో వరుసగా కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు హుజూరాబాద్ ఏసీపీ మాధవి తెలిపారు. వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం ఉదయం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో తనిఖీలు ని
ఏసీపీ మాధవి


తెలంగాణ, కరీంనగర్. 20 సెప్టెంబర్ (హి.స.)

నేరాల నియంత్రణ కోసం జిల్లాలో వరుసగా కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు హుజూరాబాద్ ఏసీపీ మాధవి తెలిపారు. వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం ఉదయం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించబడ్డాయి. ఈ తనిఖీల్లో వాహనాలకు సరైన పత్రాలు లేని 22 ట్రాక్టర్లు, 18 టూ- వీలర్స్, 4 గూడ్స్ వెహికల్స్ సీజ్ చేయబడ్డాయని తెలిపారు. మండలంలో అనుమతి లేకుండా ఎవరు ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాక, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించారు. అలాగే, సైబర్ మోసాలు, రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande