హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం.. బాలిక మృతి
హైదరాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.) వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ముక్కుపచ్చలారని చిన్నారి మృతి చెందింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లికి చెందిన శేఖర్, జ్యోతి దంపతుల కూతురు నిహారిక (11) గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు 10 ర
బాలిక మృతి


హైదరాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.)

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ముక్కుపచ్చలారని చిన్నారి మృతి చెందింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లికి చెందిన శేఖర్, జ్యోతి దంపతుల కూతురు నిహారిక (11) గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు 10 రూపాయల నాణెం మింగింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన వనస్థలిపురంలోని తన్వి హాస్పిటల్కు తీసుకువచ్చారు. అదే రోజు రాత్రి సర్జరీ చేసిన వైద్యులు నిహారిక మింగిన 10 రూపాయల కాయిన్ ను తొలగించారు. అనంతరం మరుసటి రోజు ఉదయం (శుక్రవారం) 5 గంటల సమయంలో డిశ్చార్జ్ చేశారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత మళ్లీ నిహారిక అస్వస్థతకు గురైంది. వెంటనే నేడు కుటుంబ సభ్యులు తిరిగి నిహారికను హాస్పిటల్కు తీసుకువచ్చారు. తన కూతురిని కాపాడాలని హాస్పిటల్ వైద్యులను సిబ్బందిని వేడుకున్నారు. కానీ హాస్పిటల్ యాజమాన్యం నిహారికను తిరిగి అడ్మిట్ చేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande