హైదరాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.)
శంషాబాద్ ఎయిర్ పోర్టులో డిఆర్ఎ
అధికారులు రూ.12 కోట్ల విలువ చేసే 12 కిలోల హైడ్రో ఫోనిక్ కలుపు మొక్కల పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారుల కథనం ప్రకారం..హైదరాబాద్ జోనల్ యూనిట్లోని డీఆర్ఎ అధికారులు హైదరాబాద్ లోని విమానాశ్రయంలో దుబాయ్ నుండి వస్తున్న భారతీయ ప్రయాణికుడిని పోలీసులు అనుమానించి విచారించగా, అతడి బ్యాగులో ఆకుపచ్చ రంగులో ముద్దగా ఉన్న పదార్థాన్ని కలిగి ఉన్న ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పరీక్షలో అది గంజాయికి సంబంధించిన పదార్థంగా అధికారులు నిర్ధారించారు. లగేజీ నుంచి 6 కిలోల హైడ్రోపోనిక్ మొక్కల మిశ్రమాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో ప్రయాణీకురాలి బ్యాగును తనిఖీ చేసి 6 కిలోల హైడ్రోపోనిక్ మిశ్రమాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా సుమారు రూ.12 కోట్ల (ఐఎంవీ) విలువైన 12 కిలోల హైడ్రోపోనిక్ స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని ఎన్ డీపీఎస్ చట్టం 1985 నిబంధనల కింద అరెస్టు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు