జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం.. ఇద్దరు అధికారుల సస్పెన్షన్
తెలంగాణ, జోగులాంబ గద్వాల. 20 సెప్టెంబర్ (హి.స.) జోగులాంబ గద్వాల జిల్లాలో సెప్టెంబర్ 17న జరిగిన ప్రోటోకాల్ వివాదం పై జిల్లా పరిపాలన యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. ఈ ఘటనలో బాధ్యులుగా గుర్తించిన ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
సస్పెన్షన్


తెలంగాణ, జోగులాంబ గద్వాల. 20 సెప్టెంబర్ (హి.స.)

జోగులాంబ గద్వాల జిల్లాలో

సెప్టెంబర్ 17న జరిగిన ప్రోటోకాల్ వివాదం పై జిల్లా పరిపాలన యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. ఈ ఘటనలో బాధ్యులుగా గుర్తించిన ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉత్తర్వుల ప్రకారం, అదనపు కలెక్టర్ సిసి సీనియర్ అసిస్టెంట్ రాఘవేంద్ర గౌడ్ ను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేశారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘన, అనుచిత ప్రవర్తన ఆరోపణల ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు.

అదే ఘటనలో కేటీదొడ్డి పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ మల్లేష్ పై కూడా బాధ్యతను స్థిరపరుస్తూ జిల్లా ఎస్పీ కార్యాలయం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. కార్యక్రమం నిర్వహణలో భద్రతా ప్రమాణాలు, ప్రోటోకాల్ లోపాల కారణంగా అతనిపై చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీ రాఘవేంద్ర గౌడ్, కానిస్టేబుల్ మల్లేష్ ఇద్దరు విచారణ పూర్తయ్యే వరకు ప్రధాన కార్యాలయ అనుమతి లేకుండా తమ హెడ్క్వార్టర్లన్స్ను విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఘటనతో జిల్లా పరిపాలన, పోలీసు వర్గాల్లో కలకలం రేగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande