వాహన కొనుగోలుదారులపై భారం మోపడం దారుణం : కేటీఆర్
హైదరాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.) పెరిగిపోతున్న ప్రమాదాల నివారణకు రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలని గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలిస్తే వాటిని అమలుచేయాల్సింది పోయి, వాహన కొనుగోలుదారులపై భారం మోపడం ముఖ్యమంత్రి ప్రజావ్యతిరేక వైఖరికి నిదర్శనం అని బీఆర్ఎస్ వర్క
కేటీఆర్


హైదరాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.) పెరిగిపోతున్న ప్రమాదాల నివారణకు రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలని గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలిస్తే వాటిని అమలుచేయాల్సింది పోయి, వాహన కొనుగోలుదారులపై భారం మోపడం ముఖ్యమంత్రి ప్రజావ్యతిరేక వైఖరికి నిదర్శనం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు.

రాష్ట్ర బడ్జెట్ నుంచి రోడ్ సేఫ్టీకి నిధులు కేటాయించి భద్రతా ప్రమాణాలను పెంచకుండా ఇలా అమాయక ప్రజలపై భారం మోపడం అత్యంత దారుణం అని కేటీఆర్ మండిపడ్డారు. హైడ్రా వంటి దిక్కుమాలిన విధానాలతో ప్రభుత్వ ఆదాయాలకు గండికొట్టి, ఇప్పుడు ఆ లోటును పూడ్చలేక సామాన్య ప్రజలపై విరుచుకుపడటం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande