తెలంగాణ, వరంగల్. 20 సెప్టెంబర్ (హి.స.)
రాష్ట్రాన్ని నాశనం చేసిందే బీఆర్ఎస్ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. ధర్మసాగర్ మండలంలో శనివారం వారు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
నన్ను రాజీనామా చేయమనే హక్కు బీఆర్ఎస్ కు లేదని, ఆనాడు బీఆర్ఎస్ లో చేరిన 36 మంది ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయలేదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నానని అన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన 21 నెలలోనే 1026 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకురాగాలిగాను అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంతోని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మాత్రమే సాధ్యం అయిందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు