ఆల్మట్టి ఎత్తు పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం కుట్ర.. ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.) కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం జలాల ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచేందుకు కుట్రలు చేస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేశారు. ఇవాళ బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. క
ఎమ్మెల్సీ కవిత


హైదరాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.)

కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం

జలాల ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచేందుకు కుట్రలు చేస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేశారు. ఇవాళ బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆల్మట్టి ఎత్తు పెంచుకుండా నాటి ప్రభుత్వాలు సుప్రీ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుతం ఆ స్టేను ఉల్లంఘిస్తూ.. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపునకు 1.70 లక్షల ఎకరాల భూ సేకరణ చేసేందుకు 70 వేల కోట్ల నిధులు విడుదలకు నిర్ణయం తీసుకుందని అన్నారు. ఆ నిర్ణయంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారని తెలిపారు. డ్యామ్ ఎత్తు 5 మీ. ఎత్తు పెంచితే.. 100 టీఎంసీ నీటి నిల్వతో మహారాష్ట్రలో రెండు జిల్లాలు మునిగిపోతాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు. త్వరలోనే సుప్రీం కోర్టుకు కూడా పోతామని చెప్పారని అన్నారు. ఈ వారంలోనే కృష్ణా ట్రైబ్యూనల్ హియరింగ్ ఉందని.. ఆ సమాశానికి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి హాజరై ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల రాష్ట్రానికి జరుగుతోన్న నష్టాన్ని కృష్ణా ట్రైబ్యూనల్ అధికారులకు వివరించాలని కవిత డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande