నిజాముద్దీన్ మృతదేహాన్ని పాలమూరుకు తీసుకువచ్చేలా కృషి చేస్తా : ఎంపీ డీకే అరుణ
తెలంగాణ, మహబూబ్నగర్.20 సెప్టెంబర్ (హి.స.) దురదృష్టకరంగా అమెరికాలో మృతి చెందిన నిజాముద్దీన్ మృతదేహాన్ని పాలమూరుకు తీసుకురావడానికి కృషి చేస్తానని మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో వి
ఎంపీ డి కే అరుణ


తెలంగాణ, మహబూబ్నగర్.20 సెప్టెంబర్ (హి.స.)

దురదృష్టకరంగా అమెరికాలో మృతి చెందిన నిజాముద్దీన్ మృతదేహాన్ని పాలమూరుకు తీసుకురావడానికి కృషి చేస్తానని మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, నిజాముద్దీన్ మరణం తనకు ఎంతో బాధ కలిగించిందని, విషయం తెలిసిన వెంటనే ఆయన తల్లిదండ్రులతో మాట్లాడి ఓదార్చినట్లు వివరించారు. ఇప్పటికే ఈ విషయమై భారత విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడినట్లు, ఎక్స్టర్నల్ ఎఫైర్స్ కమిటీకి కూడా లేఖ రాసినట్లు తెలిపారు. ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఎంపీ డీకే అరుణ కుటుంబ సభ్యులకు

భరోసా కల్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande