15 ఏళ్లు పూర్తి చేసుకున్న అమ్మాయిలకు ప్రత్యేక సంఘాలు: మంత్రి సీతక్క
హైదరాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.) త్వరలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న అమ్మాయిల కోసం బాలికా సంఘాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినుల బతుకమ్మ వేడుకల్ల
మంత్రి సీతక్క


హైదరాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.)

త్వరలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న అమ్మాయిల కోసం బాలికా సంఘాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినుల బతుకమ్మ వేడుకల్లో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మనందరికీ స్ఫూర్తి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అని, ఆమె పేరుపై నెలకొల్పిన ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులంతా స్ఫూర్తితో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణకు పెద్ద పండుగ బతుకమ్మ అని, మహిళల సామూహిక జీవన విధానానికి ఈ పండుగ నిదర్శనం అని చెప్పారు. చెరువులే తెలంగాణకు జీవనాధారం అని, అందుకే బతుకు నిచ్చిన చెరువులకు పూజలు చేసుకోవడమే బతుకమ్మ పండుగ అని వివరించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande