ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి.. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి
తెలంగాణ, నల్గొండ. 20 సెప్టెంబర్ (హి.స.) ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా హాలియా మండలంలోని ఇబ్రహీంపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల అలీనగర్ లో సుమారు రూ.6
ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి


తెలంగాణ, నల్గొండ. 20 సెప్టెంబర్ (హి.స.)

ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా హాలియా మండలంలోని ఇబ్రహీంపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల అలీనగర్ లో సుమారు రూ.6 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన అంగన్ వాడి భవనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండేళ్లలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, గృహ జ్యోతి పథకంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తదితర పథకాలు ప్రజాధరణ పొందాయని పేర్కొన్నారు. అంగన్వాడి. కేంద్రాలను బలోపేతం చేసేందుకు అంగన్వాడీల్లో పూర్వ ప్రాథమిక విద్య అమలు చేస్తున్నట్లు వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande