హైదరాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు
భారత వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరికొద్ది సేపట్లో జనగాం, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నల్లగొండ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షo కురుస్తుందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గంటలకు 41 నుంచి 61 కి. మీ. ల వేగంతో గాలులు వీస్తాయని, పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భార్షం పడే అవకాశం ఉందని ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఆదిలాబాద్, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, జిల్లాల్లో రాగల రెండు మూడు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు అలర్ట్ జారీ అయిన జిల్లా యంత్రాంగం, అధికారులు సిద్ధంగా ఉండాలని ఐఎండి సూచించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు