నేరాల నియంత్రణకే కార్డన్ సెర్చ్ : డీసీపీ శ్రీనివాస్
హైదరాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.) నేరాల నియంత్రణకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు రాజేంద్రనగర్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు శనివారం తెల్లవారు జామున 6 గంటలకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస
డీసీపీ శ్రీనివాస్


హైదరాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.) నేరాల నియంత్రణకు కార్డన్ సెర్చ్

నిర్వహించినట్లు రాజేంద్రనగర్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు శనివారం తెల్లవారు జామున 6 గంటలకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్ నగర్, ఇంద్ర నగర్ ప్రాంతాలలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. మొత్తం 300 మంది సిబ్బంది పాల్గొనగా 12 సెర్చ్ టీంలతో పాటు 5 ప్రధాన అర్హదారులలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ తనిఖీలలో 55 ద్విచక్ర వాహనాలు, అందులో సరైన పత్రాలు లేని 16 వాహనాలు, నెంబర్ ప్లేట్స్ లేకుండా 35 నడుస్తున్న వాహనాలు, సరైన పత్రాలు లేని 6 ఆటోలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్న 9 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. 2 బెల్టుషాపులను సీజ్ చేశారు. 2 హుక్కా సెంటర్లు, గ్యాస్ ఫిల్లింగ్ రీఫిల్ సెంటర్లపై దాడులు చేశారు. చెక్ పోస్ట్ ల వద్ద వాహనాలను పరిశీలించి చలానాలు కట్టకుండా తిరుగుతున్న వాహనాలను గుర్తించి చలనాలు కట్టించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande