తెలంగాణ, ఖమ్మం. 20 సెప్టెంబర్ (హి.స.)
యూరియా కోసం వచ్చిన రైతులకు పోలీస్ బందోబస్తు మధ్య పంపిణీ చేసిన పరిస్థితి ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతలలో శనివారం చోటుచేసుకుంది. మండలంలోని రావినూతల సహకార సంఘానికి యూరియా రావడంతో విషయం తెలుసుకున్న రావినూతల, ఆలపాడు గ్రామాలకు చెందిన రైతులు భారిగా చేరుకున్నారు. సహకార సంఘానికి కేవలం 323 కట్టలు యూరియా మాత్రమే వచ్చింది. కానీ వారం రోజుల క్రితం రైతులకు సంబంధించిన ఆధార్ కార్డులను సేకరించారు. వీటితో పాటు మరో 400 మంది రైతులు యూరియా కోసం సహకార సంఘం వద్దకు రావడంతో నేను ముందుంటే నేను ముందు అంటూ తోపులాట మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఆధార్ కార్డులు ఆధా రంగా కాకుండా సాగు చేసిన భూమి ఆధారంగా యూరియాను పంపిణీ చేయాలని ఆందోళన దిగారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు