అక్రమ కలప లారీని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు.. కేసు నమోదు
నాగర్ కర్నూల్, 20 సెప్టెంబర్ (హి.స.) అనుమతి లేకుండా అక్రమంగా కలప దుంగలను తరలిస్తున్న లారీని శుక్రవారం రాత్రి కొల్లాపూర్ ఫారెస్ట్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామ పరిసరాల్లోని ఎన్నో దశాబ్దా
అక్రమ కలప లారీ


నాగర్ కర్నూల్, 20 సెప్టెంబర్ (హి.స.)

అనుమతి లేకుండా అక్రమంగా కలప

దుంగలను తరలిస్తున్న లారీని శుక్రవారం రాత్రి కొల్లాపూర్ ఫారెస్ట్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామ పరిసరాల్లోని ఎన్నో దశాబ్దాల వయస్సు గల వేప వృక్షాలను నేలకొరిగారు. వివిధ సైజులలో వేపదుంగలను కట్ చేసి AP 12V 2714 లారీలో అక్రమంగా శుక్రవారం రాత్రి హైదరాబాద్కు తరలిస్తుండగా, స్థానిక ఇన్చార్జి ఎఫ్తర్వో ఈశ్వర్ నేతృత్వంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు శివకుమార్, భయన్న, బీట్ ఆఫీసర్ లక్ష్మయ్య దాడి చేసి పట్టుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande