ఆస్కార్ రేసులో ఆ ఐదు తెలుగు చిత్రాలు..
హైదరాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.) ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) ఈసారి ఆస్కార్ అవార్డులకు ఇండియా నుంచి అధికారికంగా ఎంపికైన సినిమా జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నుంచి నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన ''హోమ్ బౌండ్'' అనే హిందీ చిత్
ఆస్కార్ తెలుగు


హైదరాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.) ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) ఈసారి ఆస్కార్ అవార్డులకు ఇండియా నుంచి అధికారికంగా ఎంపికైన సినిమా జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నుంచి నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన 'హోమ్ బౌండ్' అనే హిందీ చిత్రం బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ కింద ఎంపికైంది. అలాగే తెలుగు నుంచి పుష్ప 2 తో పాటు సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప, గాంధీ తాత చెట్టు, కుబేరా చిత్రాలు పోటీ పడబోతున్నాయి.

మరోవైపు ఇప్పటి వరకు ఇండియా నుంచి కేవలం మూడు చిత్రాలు మాత్రమే ఆస్కార్ నామినేషన్స్ సాధించాయి. మదర్ ఇండియా (1957), సలాం బాంబే (1988), లగాన్ (2001). అయితే ఈ మూడు సినిమాలకు కూడా అవార్డు రాలేదు. అయితే ఈసారి అయిన 'హోమ్ బౌండ్' ఆస్కార్ సాధిస్తుందని సినీ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande