మూడు గంటలు ఆలస్యంగా ఇండిగో విమానం టేకాఫ్‌
హైదరాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.) కాన్పూర్‌:న్యూఢిల్లీ,22,సెప్టెంబర్ (హి.స.) 172 మంది ప్రయాణికులతో బయలుదేరేందుకు సిద్ధమైన ఇండిగో విమానం ఒక ఎలుక కారణంగా మూడు గంటలు ఆలస్యంగా టేక్‌ ఆఫ్‌ అయ్యింది. కాన్పూర్ నుండి ఢిల్లీకి వెళ్లే విమానంలో ఈ ఘటన చోటుచేసుకుం
Indigo


హైదరాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.)

కాన్పూర్‌:న్యూఢిల్లీ,22,సెప్టెంబర్ (హి.స.) 172 మంది ప్రయాణికులతో బయలుదేరేందుకు సిద్ధమైన ఇండిగో విమానం ఒక ఎలుక కారణంగా మూడు గంటలు ఆలస్యంగా టేక్‌ ఆఫ్‌ అయ్యింది. కాన్పూర్ నుండి ఢిల్లీకి వెళ్లే విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానపు సిబ్బంది క్యాబిన్‌లో ఎలుక కనిపించడంతో ఎలుకను వెదికి పట్టుకునేందుకు ముందుగా ప్రయాణికులను కిందకు దింపారు. ఎలుకను పట్టుకుని, దానిని తొలగించిన తర్వాత విమానం బయలుదేరింది.

షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ-కాన్పూర్ ఇండిగో విమానం ఆదివారం మధ్యాహ్నం 2.10 గంటలకు చకేరి విమానాశ్రయం(కాన్పూర్‌)లో ల్యాండ్ అయింది. ఆ విమానం మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరాల్సి ఉంది. ఆ సమయంలో విమానంలో దాదాపు 172 మంది ప్రయాణికులున్నారు. టేకాఫ్‌కు సిద్ధం అయ్యేంతలో క్యాబిన్ లోపల ఒక ఎలుక పరిగెత్తుతున్నట్లు సిబ్బంది ఒకరు గమనించారు. ఆయన ఈ విషయాన్ని సీనియర్ అధికారులకు తెలియజేయగా, తొలుత ప్రయాణికులందరినీ దింపి, లాంజ్‌కు తరలించారు. ఎలుకను పట్టుకుని , దానిని తొలగించిన తర్వాత ప్రయాణికులను విమానంలోనికి ఎక్కాలని కోరారు. విమానం సాయంత్రం 4.50 గంటలకు బయలుదేరింది. కాన్పూర్ విమానాశ్రయ మీడియా ఇన్‌ఛార్జ్ వివేక్ సింగ్ విమానంలో ఎలుక ఉందని ధృవీకరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande