శ్రావ్యమైన కీర్తనతో నవరాత్రులకు ప్రధాని మోదీ స్వాగతం
హైదరాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.) న్యూఢిల్లీ,22,సెప్టెంబర్ (హి.స.): ‍ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (సోమవారం) నుంచి ప్రారంభమైన శారదా నవరాత్రులను ప్రముఖ శాస్త్రీయ గాయకుడు పండిట్ జస్రాజ్ పాడిన భక్తి భజన కీర్తనతో స్వాగతించారు. ఈ సందర్బంగా ప్రధాని తన సందేశంల
PM Modi (File Photo)


హైదరాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.)

న్యూఢిల్లీ,22,సెప్టెంబర్ (హి.స.): ‍ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (సోమవారం) నుంచి ప్రారంభమైన శారదా నవరాత్రులను ప్రముఖ శాస్త్రీయ గాయకుడు పండిట్ జస్రాజ్ పాడిన భక్తి భజన కీర్తనతో స్వాగతించారు. ఈ సందర్బంగా ప్రధాని తన సందేశంలో.. పండుగ వాతావరణంలో సంగీతం అందించే ఆధ్యాత్మిక ఆనందాన్ని అందరితో పాటు పంచుకోవాలని. దేశ ప్రజలు తమకు ఇష్టమైన భజనలతో పునీతులు కావాలన్నారు. నవరాత్రి అంటే స్వచ్ఛమైన భక్తి అని, చాలా మంది ఇటువంటి భక్తిని సంగీతం ద్వారా సంగ్రహించారన్నారు. పండిట్ జస్రాజ్ శృతి చేసిన అలాంటి ఒక ఆత్మీయమైన పాటను మీతో పంచుకుంటున్నాను అని ప్రధాని మోదీ ‘ఎక్స్‌’ పోస్టులో పేర్కొన్నారు.

భజన కీర్తనల ఆలాపనలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ, ఆయన ‍ప్రజల నుంచి వారి సొంత భజన పాటలను తనకు పంపాలని లేదా వారికి ఇష్టమైన వాటిని తనతో షేర్‌ చేసుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో వాటిని అందరికీ షేర్‌ చేస్తానని ప్రధాని తెలిపారు. నవరాత్రుల తొలి రోజున దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. భక్తి, ధైర్యం, దృఢ సంకల్పంతో నిండిన ఈ పవిత్ర ఉత్సవం ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త బలాన్ని కొత్త విశ్వాసాన్ని పెంపొందించాలి.. జై మాతా ది! అని ప్రధాని మోదీ రాశారు

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande